గణితంలో కెరియర్ అవకాశాలు! 1 m ago
ఏఐ జాబ్ మార్కెట్‌లో రాజ్యమేలుతున్న తరుణంలో గణిత పరిజ్ఞానం ఓ ముఖ్యమైన నైపుణ్యంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మెషిన్ లెర్నింగ్ వరకూ అనేక రకాలుగా గణిత శాస్త్ర థియరీలు చక్కని ఆవిష్కరణలు చేసేందుకు ఉపయోగపడుతున్నాయి. డ్రైవర్ అవసరం లేకుండా వాహనాలే సొంతంగా చూసి, నిర్ణయాలు తీసుకునే వాహనాల సిస్టమ్‌ను విశ్లేషించే వారే అటానమస్ వెహికల్ సిస్టమ్ అనలిస్ట్. వీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లీనియర్ ఆల్జీబ్రా వంటి వాటితో ఇటువంటి మోడల్స్‌ను రూపొందిస్తారు. ఎటువంటి మానవ సహాయం లేకుండా, తమంతట తాముగా నడిచే వాహనాలను అటానమస్ వెహికల్స్ అంటారు. ఇవి గణితం, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ వంటి వివిధ సబ్జెక్టుల కలయిక.